srikalahasti nadikudi railway lineThe AP government on Tuesday sanctioned Rs 271.06 crore for acquisition of land for the proposed railway line between Nadikudi and Srikalahasti that passes through the backward areas of Guntur, Prakasam, Nellore and Chittoor district.

The railway ministry had earlier urged the state government to acquire land so that it could go ahead with the longpending project. The 308.7 km railway line will provide an alternative rail road link between Hyderabad and Chennai. It will help boost the backward areas through export of locally mined minerals.

AP chief secretary IYR Krishna Rao convened a mee ting with officials of railways and transport department and reviewed the status.

According to an official statement here, the government has issued a notification to acquire land in three villages.About 2,900 acres of land is needed in Nellore district alone. Railway officials told the chief secretary that 118 hectares of forest land need to be de-notified to lay the railway track. Proposals have been sent to the Centre seeking permission for identifying the land for compensatory social forestry.

District collectors have been directed to coordinate with railway officials to complete the survey at the earliest. The line will connect the proposed Nadikudi-Srikalahasti and Singarayakonda-Kanigiri tracks.

Click on the map below to ZOOM

 క్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేమార్గానికి సంబంధించిన పనులు వేగం పుంజుకున్నాయి. తొలిదశలో గుంటూరు జిల్లాలో 46.2కిలోమీటర్లకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పనులు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రప్రభుత్వం భూసేకరణకు రూ.271.06 కోట్లను విడుదల చేయడంతోరైతులకు పరిహారం చెల్లించి భూమి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రధానమంత్రి ప్రాధాన్య ప్రాజెక్టుల కింద నడికుడి-శ్రీకాళహస్తి మార్గాన్ని గుర్తించి ప్రగతిని సమీక్షిస్తుండడంతో వారానికోసారి రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనుల పురోగతిపై ఆరా తీస్తున్నారు. దీంతో భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 14 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ : నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేమార్గానికి తొలిదశలో గుంటూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో 14 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ పనులు ప్రారంభించారు. బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైను నిర్మాణానికి ఎంతభూమి అవసరమో లెక్కించి గ్రామాల వారీగా నోటిఫికేషన్లు జారీచేసి సర్వే చేసి భూమిని గుర్తించారు. మొత్తం 704.45 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. పిడుగురాళ్ల, నకరికల్లు, రొంపిచర్ల, శావల్యాపురం మండలాల్లో భూమిని సేకరిస్తున్నారు. నరసరావుపేట, గురజాల, గుంటూరు రెవెన్యూ డివిజన్‌ అధికారుల పరిధిలో భూసేకరణను చేపట్టారు. ఇక్కడి మార్కెట్‌ ధరలను అనుసరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని లెక్కించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.2.54 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.12.85లక్షల చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈమొత్తానికి రైతులు అంగీకరించకపోవడంతో మధ్యేమార్గంగా మూడు డివిజన్ల ఆర్డీవోలు కలిసి చర్చించుకుని ఎకరాకు సగటున ఒకే ధర చెల్లించేలా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించే ధరకు రైతులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో జిల్లా సంయుక్త పాలనాధికారి రైతులతో నరసరావుపేటలో గత నెల 8వతేదీన రైతులు, తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలపై రైతులకు అవగాహన కల్పించి సహకరించాలని కోరారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతామన్నారు. జిల్లా పాలనాధికారి భూసేకరణ గ్రామాల్లో పర్యటించి రైతులతో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేమార్గాన్ని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టారని, నూతన రాష్ట్రంలో ఇది అత్యంత ప్రధానమైనదని వివరించారు. దీనివల్ల ఈప్రాంతంలో రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెంది వ్యాపార లావాదేవీలు విస్తృతమవుతాయన్నారు. ఇందుకు అందరూ సహకరిస్తే న్యాయమైన పరిహారం అందిస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు గ్రామాల వారీగా పరిహారం సొమ్ము వివరాలు ఇలా ఉన్నాయి.

విస్తీర్ణం ఎకరాలలో….
* ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు చెల్లించే సొమ్ము రూ.లక్షలలో
* గుంటూరు జిల్లాలో సేకరించే భూమి మొత్తం 704.45 ఎకరాలు

రైౖతుల డిమాండ్లు ఇలా…
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేమార్గం నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతులు పలు డిమాండ్లను అధికారులకు విన్నవించారు. అందులో ప్రధానమైనవి ఇలా…
* ఎకరాకు నిబంధనల ప్రకారం ఇస్తున్న పరిహారం చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. జిల్లాలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంతో భూముల విలువ అనూహ్యంగా పెరిగిందని గుర్తుచేస్తున్నారు. ఈక్రమంలో ఎకరా భూమికి పరిహారంగా రూ.20లక్షల నుంచి రూ.35లక్షల వరకు చెల్లించాలని గ్రామాల వారీగా రైతులు కోరుతున్నారు. కోనంకి గ్రామంలో అత్యధికంగా రూ.35లక్షలు చెల్లించాలని కోరారు.
* జీవనోపాధికి ఆధారంగా ఉన్న భూములు కోల్పోతున్నందున కుటుంబంలో ఒకరికి రైల్వేలో ఉద్యోగం ఇవ్వాలి.
* రైల్వే ప్రాజెక్టుకు భూసేకరణ చేయగా కొంతభూమి మాత్రమే మిగిలితే అందులో వ్యవసాయం చేయడం సాధ్యం కాదు కనుక ఆభూమికి కూడా పరిహారం చెల్లించాలి.
* జాతీయరహదారులు, ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పొలాలకు అందరితోపాటు కాకుండా భూముల విలువ దృష్ట్యా పరిహారం అదనంగా చెల్లించాలి.

ప్రాజెక్టు వస్తే ప్రయోజనాలెన్నో…
* ఈస్ట్‌కోస్ట్‌ ట్రంక్‌ రూట్‌ విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకల రద్దీ భారం ఎక్కువగా ఉంటోంది. ఇది తీరప్రాంతం సమీపం గుండా ప్రయాణించడంతో తుపానులు, వరదలు వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. దీంతో నడికుడి-శ్రీకాళహస్తి మార్గం అందుబాటులోకి వస్తే ప్రత్యామ్నాయ మార్గంగా ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుత రైల్వేమార్గంపై ఒత్తిడి తగ్గుతుంది.
* ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలో సరకు రవాణాకు ఈమార్గం అత్యంత అనుకూలమైన మార్గం కానుంది.
* నడికుడి-శ్రీకాళహస్తి మార్గానికి అవసరమయ్యే భూమిని రాష్ట్రప్రభుత్వమే సేకరించి అందుకయ్యే వ్యయాన్ని భరించాలి. ప్రాజెక్టు వ్యయంలోనూ రాష్ట్రప్రభుత్వం 50శాతం భరించేలా కేంద్రంతో ఒప్పందం చేసుకుని పనులు చేపట్టారు.

Advertisements