Rambilli, Vizag may get deep water warship building facility

rambilli vizag deep water warship manufacturingA greenfield deep water warship building facility is likely to come up at Rambilli in Visakhapatnam district. The Kolkata based warship builder Garden Reach Shipbuilders & Engineers (GRSE), controlled by the Ministry of Defence (MoD), had identified a suitable location at Rambilli and the state government had agreed to provide land with adequate water frontage for the project. Vizag already houses the MoD-controlled shipyard. Hindustan Shipyard Limited (HSL).

GRSE, which has a good order book, is trying to bag other prestigious ship and submarine building projects from the Indian Navy. The company has also conveyed its willingness to participate in the race for building Indian Aircraft Carrier, India’s second indigenous aircraft carrier, INS Vishal, to be built at their Vizag facility, if they get the MoD’s order.

The company’s proposal has been forwarded to the Navy. Their final decision on selection of the shipyard is awaited, said a GRSE source. The government has set up a high-level study group, headed by Assistant Controller of the Carrier Project, Rear Admiral Surendra Ahtlla, to identi
fy such a shipyard. India’s first indigenous aircraft carrier, INS Vikrant, is already being built at the Cochin shipyard. The 90,000-tonne Vikrant will be able to carry 30 aircraft. The Vizag district administration has also identified around 200 acres in Rambilli Mandal to give to GRSE for the building of INS Vishal. The depth analysis of the waterfront is under way by the National Institute of Oceanography (NlO). Depending on the proposal given by the GRSE based on the analysis report, we are ready to hand over the land to the ship-building company. district collector. Dr N. Yuvaraj said.

రాంబిల్లి దశ తిరిగే…

రూ. 5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం
మరో రూ. 10 వేల కోట్లతో అనుబంధ పరిశ్రమలు
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్‌ఏడీఏ

రాంబిల్లి వద్ద 5 వేల కోట్ల రూపాయలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నౌకా నిర్మాణ కేంద్రాన్ని నిర్మించబోతున్నాం. రిలయన్స్‌ఏడీఏ సంస్థ తన నౌకా నిర్మాణరంగ విభాగాన్ని గణనీయంగా విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ కేంద్రానికి అనుబంధంగా ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఆ పెట్టుబడుల విలువే సుమారు రూ. 10 వేల కోట్ల వరకు ఉంటుంది. ఫలితంగా వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అణు జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు, కీలక నౌకాదళ అవసరాలను తీర్చడానికి ఈ నిర్మాణ కేంద్రం అత్యంత కీలకంగా నిలుస్తుంది.

రాంబిల్లి ప్రాంతం దశ తిరగబోతోంది. అంతర్జాతీయ నౌకా నిర్మాణ కేంద్రంగా అవతరించనుంది. రాంబిల్లి ప్రాంతంలో సుమారు పది కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. ఇక్కడ నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు ఆదివారం విశాఖ నగరంలో భాగస్వామ్య సదస్సులో రిలయన్స్‌ఏడీఏ అధినేత అనిల్‌ అంబానీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది కార్యరూపం దాలిస్తే అన్నివిధాలుగా వెనుకబడి ఉన్న రాంబిల్లి మండలం ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

రాంబిల్లి మండలంలో సీతపాలెం నుంచి కొత్తపట్నం వరకు సుమారు పది కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. మరోవైపు ఎలమంచిలి – గాజువాక, అచ్యుతాపురం సెజ్‌ నుంచి అనకాపల్లి వరకు ఉన్న రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధికి సర్వే చేస్తున్నారు. ఇదే మండలంలో ఏర్పాటవుతున్న ప్రత్యామ్నాయ నావికాస్థావరం (ఎన్‌ఏఓబీ) ప్రాజెక్టు వెళ్లే రాంబిల్లి ప్రధాన రహదారిని 40 అడుగుల మేర విస్తరించి అభివృద్ధి చేస్తున్నారు. రాంబిల్లి తీరప్రాంతం జలరవాణా, ఓడరేవుల ఏర్పాటుకు అనువుగా ఉండడంతో రెండు నెలల క్రితం పరిశ్రమలశాఖ అధికారులు, ప్రైవేటు పరిశ్రమల ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి వెళ్లారు. లోవపాలెం, రాంబిల్లి పంచాయతీ శివారు వాడపాలెం తీరాలను అధికారులు అప్పట్లో పరిశీలించారు. ఈ రెండుచోట్ల ఏదో ఒకచోట నౌకాకేంద్రం రావచ్చని స్థానికులు కూడా భావించేవారు. రిలయన్స్‌ఏడీఏ సంస్థ తాజా ప్రతిపాదన సాకారమైతే రక్షణ ఉత్పత్తులకు సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా రానున్నాయి. ఈ ప్రాజెక్టులతోపాటుగా అనేక పరిశ్రమలు తీరప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తీరంలో వేయి ఎకరాల ప్రభుత్వ స్థలం
రాంబిల్లి మండల తీరంలో తీరప్రాంత అటవీస్థలం 557 ఎకరాలు ఉండగా మరో 500 వందల ఎకరాల వరకు ప్రభుత్వ స్థలాలున్నాయి. ఎనిమిది తీరగ్రామాలున్నాయి. రాంబిల్లి తీరప్రాంత అటవీబ్లాక్‌లో 302 ఎకరాలు, సీతపాలెం బ్లాక్‌లో మరో 255 ఎకరాలు తీరప్రాంత అటవీస్థలం ఉంది. తీరప్రాంతంలో ఉన్న గ్రామాలలో సుమారు 16 వేల జనాభా ఉంది.

Advertisements

One thought on “Rambilli, Vizag may get deep water warship building facility

  1. Pingback: Anil Ambani’s Reliance and Bharat Forge sign MOUs with Andhra Pradesh | Andhra Nation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s