Rs 4.5 lakh crores — Estimate of expenses by Sivaramakrishnan committee for construction of new capital

Sivaramakrishnan committee estimates a total expenses of Rs 4.5 cr for construction of new capital and for infrastructure around it. This figure also include things like rail connectivity etc.

You can read the Eenadu report on the same HERE. 

Here is the reproduced “Andhra Jyothy” report on this estimate.

నవ్యాంధ్ర నిర్మాణానికి రూ.4.5 లక్షల కోట్లు అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ అంచనా వేసింది! అదే సమయంలో సూపర్‌ రాజధాని నిర్మాణం అసాధ్యమని అభిప్రాయపడింది! అభివృద్ధి, పాలన వికేంద్రీకరణతోనే ప్రయోజనమని స్పష్టం చేసింది! సుదీర్ఘ కాలం హైదరాబాద్‌ నుంచి పాలన కష్టతరమని తేల్చి చెప్పింది.
ఏపీ కొత్త రాజధానిపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ రాజధానితో పాటు నవ్యాంధ్ర నిర్మాణం కోసం రూ.4.5 లక్షల కోట్లు ఖర్చవుతాయని తేల్చి చెప్పింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు ప్రభుత్వ – ప్రైవేట్‌ పెట్టుబడులే మార్గమని స్పష్టం చేసింది. కొత్త రాష్ట్రంలో రహదారులు, రైల్వే నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయడంతో పాటు రేవులు, విమానాశ్రయాలకూ పెద్ద పీట వేయాలని సూచించింది. కొత్త రాఽజధానిలో మౌలిక వసతుల కల్పన కోసమే రూ.15,000 కోట్లకు పైగా అవసరమని తెలిపింది.

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని ప్రాంతాన్ని సూచించేందుకు ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ, కొత్త రాష్ట్ర అభివృద్ధికి భారీగానే ఖర్చవుతుందని తెలిపింది. రాజఽధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాదాపు రూ.4.5లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. కొత్త రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, రైల్వే వ్యవస్థ, ప్రధాన ఓడ రేవుల అభివృద్ధికే దాదాపు రూ.24.305 కోట్ల పెట్టుబడులు అవసరమని తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు రూ.7,000 కోట్లు, రైల్వేల అభివృద్ధికి రూ.7,305 కోట్లు, దుగరాజపట్నంసహా చిన్న, ప్రధాన ఓడరేవుల అభివృద్ధి కోసం రూ.12,000 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. రోడ్ల నిర్మాణానికి కూడా రూ.22,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. విజయవాడ, విశాఖపట్నంలో రెండు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, తిరుపతి విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి మరో రూ.10,200 కోట్లు అవసరమని తెలిపింది.
వీటన్నిటిని ఆయా జాతీయ సంస్థల పర్యవేక్షణలో ప్రభుత్వ – ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్దతిలో చేపట్టాలని సూచించింది. పీపీపీ పద్దతిలోనే రూ.1,500 కోట్ల అంచనాతో జలమార్గాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని కమిటీ సూచించింది. రాయలసీమలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కడప జిల్లాలో రూ.25,000 కోట్ల పెట్టుబడితో సమీకృత స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. కోస్తా ప్రాంతంలో రూ.40,000 కోట్ల అంచనాతో మరో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా కమిటీ పేర్కొంది. సీమాంధ్ర ప్రాంతంలోని విద్యుత్‌, పారిశ్రామిక అవసరాలకు అవసరమైన గ్యాస్‌ కోసం గంగవరం పోర్టు దగ్గర రూ.4,500 కోట్లతో తలపెట్టిన ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరింది. అత్యంత కీలకంగా భావిస్తున్న వైజాగ్‌ – చెన్నయ్‌ పారిశ్రామిక కారిడార్‌ ఏర్పడితే దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. పీపీపీ పద్దతిలో ఐటీ పెట్టుబడుల ప్రాంతం, ఎలక్ర్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్ల ఏర్పాటు కోసం కూడా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
రైల్వే వ్యవస్థ: ఏపీలో రైలు మార్గాల విస్తరణ, కొత్త మార్గాల ఏర్పాటు కోసం రూ.7,305 కోట్లు ఖర్చు చేయాలని శివరామకృష్ణన్‌ కమిటీ పేర్కొంది. రైల్వే శాఖ పరిధిలో నల్లపాడు-ద్రోణాచలం విద్యుద్దీకరణకు రూ.500 కోట్లు, బీబీనగర్‌-నల్లపాడు విద్యుద్దీకరణకు రూ.375 కోట్లు, విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపూర్‌-మచిలీపట్నం రైలు మార్గం డబ్లింగ్‌ కోసం రూ.1,200 కోట్లు, గుంటూరు-తెనాలి-రేపల్లె డబ్లింగ్‌కు రూ.150 కోట్లు, గూడూరు-దుగరాజపట్నం వరకూ 45 కిలోమీటర్ల పొడవున కొత్త లైన్‌ ఏర్పాటుకు రూ.330 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ నిర్మాణానికి కూడా రూ.1,500 కోట్లు కావాలని తెలిపింది. భద్రాచలం నుంచి కొవ్వూరు వరకూ 108 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటుకు రూ.1,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. కడప-బెంగళూరుకు మధ్య 225 కిలో మీటర్ల మేర కొత్త లైన్‌ కోసం మరో రూ.225 కోట్లు ఖర్చవుతాయని తెలిపింది.
రహదారులు: ఇక రహదారుల కోసం రూ.22,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వరకూ ఎనిమిది లైన్ల రహదారి నిర్మించాలని సూచించింది. ఇందుకోసం దాదాపు రూ.15,000 కోట్లు ఖర్చవుతుందని కమిటీ అంచనా వేసింది. గుత్తి-ప్రొద్దుటూరు-బద్వేలు-నెల్లూరు మధ్య రూ.3,000 కోట్ల అంచనాతో 293 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారి, కర్నూలు-ఆత్మకూరు-వినుకొండ-నల్లపాడు మధ్య 420 కిలో మీటర్ల మేర రూ.4,000 కోట్ల అంచనాతో మరో నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని సిఫారసు చేసింది.
ప్రధాన కట్టడాల ఖర్చు: రాజ్‌భవన్‌కు రూ.56 కోట్లు, ముఖ్యమంత్రి తాత్కాలిక సెక్రటేరియేట్‌ కోసం రూ.68 కోట్లు, అసెంబ్లీ కోసం రూ.450 కోట్లు, సెక్రటేరియేట్‌కు రూ.361 కోట్లు, సెక్రటేరియేట్‌ సిబ్బంది గృహ నిర్మాణాల కోసం రూ.1,097 కోట్ల చొప్పున మొత్తం రూ.2,032 కోట్లు అవసరమవుతాయని కమిటీ తెలిపింది. హైకోర్టు ప్రధాన భవనం, కార్యాలయాలు, న్యాయమూర్తుల నివాసాల కోసం మరో రూ.1,271 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. వివిధ శాఖా కార్యాలయాలు, సిబ్బంది గృహ సముదాయాల ఏర్పాటుకు మరో రూ.6,658 కోట్లు ఖర్చవుతాయని తెలిపింది. అతిథి గృహాలు, సమావేశ మందిరాలు, కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణం కోసం మరో రూ.559 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ విధంగా ప్రధాన కట్టడాల నిర్మాణం కోసమే రూ.10,519 కోట్లు ఖర్చవుతుందని శివరామకృష్ణన్‌ కమిటీ అంచనా వేసింది.
రాజధానిలో మౌలిక సదుపాయాలు: కొత్త రాజధానిలో రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థల ఏర్పాటుకు రూ.1,536 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది. భవిష్యత్‌లో రాజధాని నగరం విస్తరణ కోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు వ్యయం చేయాల్సి ఉంటుందని శివరామకృష్ణన్‌ కమిటీ సూచించింది. ఇందులో ట్రంకు రోడ్ల నిర్మాణానికి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కింద మూడు దశల్లో రూ.1109 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అనుబంధ రోడ్లకు మొత్తం రూ.998 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు కోసం కూడా మూడు దశల్లో మొత్తం రూ.2,772 కోట్లు అవసరమవుతాయని శివరామ కృష్ణన్‌ కమిటీ పేర్కొంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s