Food processing’ in Anantapur –Chittoor, mega Food Park in Bhimavaram and Smart City’ (for IT) in Visakhapatnam

Andhra Pradesh will have a new industrial policy incorporating 11 sub-sectors like IT, Tourism etc, said Chief Minister, N Chandrababu Naidu. He said special hubs like `food processing’ in Anantapur –Chittoor, mega Food Park in Bhimavaram (500 acres) and `Smart City’ (for IT) in Visakhapatnam would be developed

Releasing the White Paper today on industries, infrastructure & employment, he said the focus would be on identifying a few growth engines and developing them. He said these `growth engines’ would be able to generate Rs 45,000 crore annually. The misrule of Cong(I) in the last decade has adversely impacted the brand image of the State and City, which has deterred investors who shifted to other states, Naidu alleged. More than two lakh acres have been indiscriminately allocated to entities like VANPIC, Lepakshi etc. All the allotments will be reviewed soon. Some of them have damaged the reputation of officials and investment.

This is what Andhra Jyothy reported on the same topic

2004-14 మద్య ఆంధ్రప్రదేశ్ అంధకారంగా మారిందని, ఇండస్ట్రీ పతనావస్థకు చేరుకుందని, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీని వల్ల కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలను యువత కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో ఆయన పారిశ్రామిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థ పాలనవల్లే రాష్టం దివాళా తీసిందని విమర్శించారు.

2004-09 మధ్య కాలంలో కాంగ్రెస్ అవినీతి-అసమర్థ పాలన… 2009-14 మధ్య అనిశ్చితితో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని చంద్రబాబు తెలిపారు. ఐటీపై 14 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు. విద్యుత్ సంక్షోభంతో 64 వేల పరిశ్రమలు మూతపడ్డాయని, రూ. 6,500 కోట్ల విలువైన ఉత్పత్తికి నష్టం వాటిల్లిందని, దీంతో 2.30 లక్షల మంది నిరుద్యోగులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి వైఎస్ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి రెండు లక్షల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకుందని ఆయన అన్నారు.

బ్రహ్మణి స్టీల్స్‌కు 10 వేల ఎకరాలు, లేపాక్షికి 8 వేల ఎకరాల భూమిని వైఎస్ ప్రభుత్వం కట్టబెట్టిందని, అక్కడ ఇప్పటికీ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయా సంస్థలు భూములు తనఖాపెట్టి రుణాలు పొందారు తప్పితే పరిశ్రమలు స్థాపించలేదని ఆయన అన్నారు. వాన్‌పిక్‌కు 19 వేల ఎకరాల భూమిని అప్పజెప్పి క్విడ్‌ప్రొకోకు వైఎస్ ప్రభుత్వం పాల్పడిందని ఆయన ఆరోపించారు. వైఎస్ హయాంలో ఎక్కడా ప్రజా ప్రయోజనాలు కనిపించలేదని, అంతా అవినీతిమయమేనని, అన్నీ సొంత ప్రయోజనాలు కల్పించుకున్నారని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను పడగొట్టారని, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ అవినీతికి బలైందని చంద్రబాబు నాయుడు అన్నారు. వోక్స్‌వ్యాగన్, టాటానానో, సీమెన్స్ తదితర కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సహజవనరులను దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. ఓబులాపురంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై టీడీపీ ఒక్కటే పోరాటం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్టీల్ పరిశ్రమ పేరుతో ఖనిజ సంపదను విదేశాలకు తరలిస్తూ, రాష్ట్రంలో మైనింగ్ మాఫియా తయారైందని చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

టైటానియంతో స్కామ్‌తో అవినీతిని ఖండంతరాలు దాటించిన ఘనత ఒక్క కాంగ్రెస్‌కు దక్కుతుందని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క పోర్టు కూడా రాష్ట్రానికి రాలేదని, ఒక్క ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు. రాజీవ్ యువకిరణాలు పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. త్వరలో ఐటీ, ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకువస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s