The CBN govt is planning to renovate and start small time operations in Cuddapah airport in 2-3 months. Tirupati airport also is likely to be upgraded to receive international flights.

Andhra Jyothy reports “జిల్లాల్లో చిన్న విమానాశ్రయాలపై కూడా చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. కడపలో ఉన్న రన్‌వేను ఉపయోగించుకొని రెండు నెలల్లో అక్కడ విమానాల రాకపోకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. అనుకున్న సమయంలో జరిగితే కొత్త రాష్ట్రంలో ప్రారంభమయ్యే మొదటి విమానాశ్రయం ఇదే అవుతుందని అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్న రన్‌వేలను ఉపయోగించుకోవడంపై కూడా దృష్టి పెట్టారు. ఈ రెండూ ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండలోని రన్‌వేను ఎలా ఉపయోగించుకోవాలన్నది పరిశీలనలో ఉంది

అంతర్జాతీయ స్థాయి విమానాలు దిగడానికి తొమ్మిది వేల మీటర్ల రన్‌వే ఉండటం మొదటి అవసరం. రన్‌వేకు రెండు పక్కలా నూటా ఏభై మీటర్ల ఖాళీ స్థలం కూడా కావాలి. తిరుపతి విమానాశ్రయంలో ప్రస్తుతం ఏడు వేల మీటర్ల రన్‌వే ఉంది. దీనిని విస్తరించడానికి ఆ పక్కనే తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలం ఉందని, దానిని వినియోగించుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జులై నాటికి ఈ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు దిగడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయవచ్చన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ”

You can read the full Report HERE.

Advertisements